నవగీతం,మల్లాపూర్
మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలకు మార్గం సంజీవ్ విద్యా నిధి ద్వారా దాత మార్గం రాజేందర్ సహకారంతో పాఠశాల కి మెన్ గెట్ ను తయారు చేయించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జువ్వాడి కృష్ణ రావు సోమవారం రిబ్బను కట్ చేసి గేటును ప్రారంభించారు. ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ గ్రామంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు, నాయకులు ముందుకు వచ్చి విద్యానిది పథకం ద్వారా తమ తమ పాఠశాలను అభివృద్ధి చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కృష్ణారావు ప్రాథమిక పాఠశాలకు టాయిలెట్స్, స్కూల్ భవన నిర్మాణానికి కృషి అలాగే జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల కి అదనపు రెండు గదుల నిర్మిస్తామని హామీ ఇచ్చారు. సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య ఈ విద్యానిధి ద్వారా స్కూల్ కి అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని అన్నారు. దీనికి సహకరించిన దాతలకు, గ్రామ ప్రజలకు, యువతకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంతడుపుల పుష్పలత నర్సయ్య, సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య, ఉప సర్పంచ్ జగ్గుల గంగాధర్, వార్డ్ మెంబర్స్ హరీష్, రమేష్, మాజీ సర్పంచ్ మామిడి లక్ష్మారెడ్డి, స్కూల్ హెడ్మాస్టర్ శ్రీనివాస్, చంద్ర ప్రకాష్, విడిసి సభ్యులు రాజేందర్ గ్రామస్తులు పాల్గొన్నారు.

