నవగీతం, మెట్ పల్లి
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మెట్ పల్లి పట్టణంలోని కొత్త బస్టాండ్ దగ్గర లోని స్వామి వివేకానంద విగ్రహానికి కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం నర్సింగరావు మాట్లాడుతూ భారతీయ ఆధ్యాత్మిక విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పిన గురువు తన ఉపన్యాసంతో జగతిని జాగృతం చేసిన మహా మేధావి భారతదేశ ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన చైతన్య మూర్తి యువతను మేల్కొల్పిన మహా వ్యక్తి అందుకే ఆయన జయంతి ని జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్నాం అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

