నవగీతం,మల్లాపూర్:
ఆధునిక యంత్రాల వినియోగం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ పనిముట్లు సబ్సిడీ ద్వారా అందిస్తోంది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామానికి చెందిన సుద్దు దేవరాజు లక్ష్మీ కి కల్టివేటర్ ను గురువారం కాంగ్రెస్ నాయకులు అందజేశారు. ఈ కల్టివేటర్ రైతాంగానికి వ్యవసాయ పనుల్లో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైతులను ఆదుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, దీనికి సహకరించిన జువ్వాడి నర్సింగరావు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాదం గంగాధర్, ఎదులాపురం రమేష్, నత్తి రాము,ఆకుల ఎర్రన్న, జంబరత్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు

