నవగీతం,మల్లాపూర్
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మల్లాపూర్ మండలం రాఘవపేటలో 8వ వార్డులో ఆడపడుచులు తమ ఇంటి ముందర వేసిన ముగ్గులలో పోటీలు నిర్వహించి అందమైన ముగ్గులను పరిశీలించి మొదటి, రెండవ, మూడవ స్థానాలు గుర్తించి విజేతలను ప్రకటించారు మొదటి విజేత కొప్పుల లావణ్య లక్ష్మణ్ ,రెండవ విజేత బండి హారిక కమలాకర్, మూడవ విజేత గడ్డం శారద సాయి రెడ్డి ఈ బహుమతులను 8వ వార్డు మెంబర్ నత్తి రాము స్వయంగా అందజేశారు.ఈ సందర్భంగా నత్తి రాము మాట్లాడుతూ ఈ సంక్రాంతి పండుగలాగే ముందు ముందు వచ్చే ప్రతి పండుగను ప్రజలతో కలిసి మెలిసి ముందుండి నిర్వహిస్తామనిఈ సంక్రాంతికి ప్రజలందరూ భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని తెలిపారు .

