రైతులకు నష్ట పరిహారం అందించే విధంగా కృషి చేస్తా. ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
జగిత్యాల జిల్లా రాయికల్ మండల రామాజీ పెట్ గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు అధైర్య పడవద్దు అని, అకాల వర్షాలకు 650 ఎకరాలలో పంట నష్టం జరిగిన వెంటనే జిల్లా,మండల స్థాయి వ్యవసాయ అధికారులు,రెవెన్యూ అధికారుల తో రైతులతో మాట్లాడడం జరిగింది అని,పంట నష్టాన్ని అంచనా వేయటం జరిగింది అని,ముఖ్యమంత్రి తో మాట్లాడడం జరిగింది అని,రైతులు నష్ట పరిహారం అందించే విధంగా కృషి చేస్తానని అన్నారు.

రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, వ్యవసాయ యంత్రాల పంపిణీ లో పంట నష్టపోయిన రైతులకు ప్రాధాన్యం కల్పిస్తామని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఏకకాలంలో 21 వేల కోట్ల రైతు రుణమాఫీ, రైతు భరోసా అమలు చేయడం జరిగిందని ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు ఆకాల వర్షాలకు దెబ్బతినడం చాలా బాధాకరం అన్నారు. జిల్లా కలెక్టర్ ఇప్పటికే పంట నష్ట రిపోర్ట్ పంపడం జరిగింది అని, ప్రభుత్వం పంట నష్ట పరిహార చర్యలు చేపడుతుంది అని ధైర్యంగా ఉండాలని రైతులను కోరారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో పంట నష్ట పోయిన రైతులు ప్రాధాన్యం ఇవ్వాలి అని అధికారులను ఆదేశించారు.

త్వరలో రైతు భరోసా కూడా ప్రభుత్వం ఇస్తుంది అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఈ ప్రభుత్వం వచ్చాక 33వేల కోట్ల అసలు వడ్డీ రూపంలో చెల్లించింది అని గుర్తు చేశారు.ప్రభుత్వం ఆర్థిక లోటు ఉన్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుంది అన్నారు. అందరికీ అండగా ఉంటా అన్నారు. కౌలు రైతులు,రైతు కూలీల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మోహన్, మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్ రావు, మండల నాయకులు కోల శ్రీనివాస్,ఏనుగు మల్లారెడ్డి,సురేందర్ నాయక్, ఉప సర్పంచ్ సుధీర్,వార్డు సభ్యులు నారాయణ, భరత్ రెడ్డి,విజయ్,నర్సా రెడ్డి, నాయకులు బేతి మోహన్ రెడ్డి, భీతి మల్లారెడ్డి,ఏ ఓ ముక్తేశ్వర, అధికారులు,రైతులు, తదితరులు పాల్గొన్నారు.

