Thursday, February 26, 2026
ads

….. అను నేను…!!!

📰 Generate e-Paper Clip

కొత్తగా 22 మంది గెలుపు..

తేలిపోయిన సిట్టింగ్లు, తాజా మాజీలు

మెట్ పల్లి మున్సిపల్ లో సత్తా చాటిన నూతన కౌన్సిలర్లు

నవగీతం, జగిత్యాల ప్రతినిధి :

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మున్సిపల్ లో జరిగిన ఎన్నిక ఎన్నికల్లో కొత్తగా 22 మంది కౌన్సిలర్లుగా గెలుపొందడం విశేషం. కొన్ని వార్డుల్లో సిట్టింగ్లు, తాజా మాజీలు ఓటమిపాలయ్యారు. వారి స్థానంలో కొత్తగా 22 మంది మున్సిపల్ కౌన్సిలర్ గా గెలుపొంది త్వరలో సమావేశ మందిరంలో తొలిసారిగా అడుగుపెట్టి తమ వాణి వినిపించనున్నారు.

కొత్తగా గెలిచింది వీరే…

పట్టణంలోని ఒకటో వార్డులో కొత్తగా కాంగ్రెస్ పార్టీ నుండి ఓంకారి నవీన్ (546 ఓట్లు) ఘన విజయం సాధించారు. అక్కడ సిట్టింగ్ కౌన్సిలర్ మార్గం హన్మండ్లుపై ఆయన గెలుపొందారు. అదేవిధంగా రెండో వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తరపున జక్కం లక్ష్మీ(551) తొలిసారిగా గెలుపొందారు. మూడో వార్డులో కాంగ్రెస్ పార్టీ తరపున బత్తుల నరేష్ (439), నాలుగో వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పందిరి రమేష్ (460), అయిదో వార్డులో బీజేపీ అభ్యర్థిగా పుడుకారం దివ్య రెడ్డి కిషోర్ (825), ఆరో వార్డులో బంగారుకాళ్ల నీరజ (698), ఏడో వార్డులో బీజేపీ అభ్యర్థిగా ధర్మపురి స్వరూప (601), 8వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థిగా దీవకొండ మానస (584), 9వ వార్డులో బీజేపీ అభ్యర్థిగా బొడ్ల వసుధ (402), 10వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నునుగొండ నరేష్ కుమార్ (668), 11వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా రెబ్బాసు మహేష్ (375), 12వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా సుమయ తబుస్సమ్ (706), 13వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అజయ్ గుడికందుల (485), 14వ వార్డులో బీజేపీ అభ్యర్థిగా దొనికెల శిరీష నవీన్ (553), 15వ వార్డులో బీజేపీ అభ్యర్థిగా అరిగెల అనూష రాకేష్ (430) 16వ వార్డులో బీజేపీ అభ్యర్థిగా అరిసె వనజ మురళీ (329), 19వ వార్డులో బీజేపీ అభ్యర్థిగా బొడ్ల ఆనంద్ (275), 20వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా మాసుల ప్రవీణ్ (367), 21వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా ఖాజా అజిమొద్దీన్ (585), 23వ వార్డులో బీజేపీ అభ్యర్థిగా కోయల్కర్ స్రవంతి లింగేశ్వర్ (475), 24వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థిగా పూదరి జ్యోతి (565), 25వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆశ్ర ఫర్హిన (334), 26వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా బొడ్ల రమేష్ (661) లు విజయం సాధించారు. ఇక్కడ 19వ వార్డు నుంచి రానవేణి సుజాత సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. అదే విధంగా 17వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన మైలారపు లింబాద్రి (457), 18వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన చెట్లపల్లి మీనా సుఖేందర్ (584), 22వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అంగడి పురుషోత్తం (483)లు ఇదివరకే గెలిచి కౌన్సిలర్ గా సేవలందించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular