Thursday, February 26, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు

ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు

📰 Generate e-Paper Clip

ఆర్బిఐ నిబంధనలకు అనుగుణంగా కేవైసీ అప్డేట్ చేసుకోవాలి.

కే డి సి సి బ్యాంకు మేనేజర్ భూక్య ప్రవీణ్

నవగీతం, మల్లాపూర్:

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశానుసారం నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలో గురువారం కేడీసీసీ బ్యాంకు మల్లాపూర్ శాఖ వారు “కేవైసీ- సురక్షిత బ్యాంకింగ్ కు మీ తొలి అడుగు” అనే నినాదంతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ)రూపొందించిన అవగాహన ప్రచార పోస్టర్ ని గ్రామ సర్పంచ్ డప్పుల పద్మ నరసయ్య ఆవిష్కరించారు. బ్యాంకు మేనేజర్ భూక్య ప్రవీణ్ మాట్లాడుతూ ఖాతాదారులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా తమ కేవైసీని అప్డేట్ చేసుకోవాలని పేర్కొన్నారు. డిజిటల్ లావాదేవీలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కలిగి ఉండాలని అలాగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచనలు అందించారు.

అదేవిధంగా కేడీసీసీ బ్యాంకు డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేటు ఇస్తుందని ఖాతాదారులు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు చేయాలని కోరారు. అదేవిధంగా గుండంపల్లి గ్రామ సర్పంచ్ పద్మా నరసయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవింగ్ ఖాతా కలిగి ఉండాలని , నగదు రహిత లావాదేవీల పట్ల అప్రమత్తతతో ఉండాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల మార్కెట్ కమిటీ చైర్మన్ అంతడుపుల పుష్పలత నర్సయ్య, బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ సి హెచ్ శ్రీనివాస్, అసిస్టెంట్ మేనేజర్ నాగరాజు, సిబ్బంది శ్రావణ్, ప్రవీణ్ ,రంజిత్, మల్లాపూర్ మరియు సిర్పూర్ సొసైటీ సెక్రటరీలు పాదం భూమేష్, మామిడి రాజేశ్వర్ రెడ్డి , గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular