నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంజూరైన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకొని శనివారం గృహప్రవేశం సందర్భంగా జగిత్యాల మండలం హన్మాజీపేట గ్రామానికి చెందిన బొడ్డు మౌనిక సురేష్ ,రాయికల్ మండల కిష్టం పెట్ గ్రామానికి చెందిన పెరుమాండ్ల భూమా గౌడ్ కొడుకు రాజేష్ గౌడ్ సంధ్య దంపతుల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ..జగిత్యాల నియోజకవర్గానికి అత్యధిక ఇండ్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కి ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు.జగిత్యాల పట్టణం లో 4500 డబల్ బెడ్ రూం ఇండ్ల ను నిర్మించాం.పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంతో నేడు సాధ్యం అయిందని అన్నారు. అర్హులైన అందరికీ రెండవ విడత లో ఇందిరమ్మ ఇండ్ల ను మంజూరు చేస్తాం అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు తో గ్రామ గ్రామాన పండగ వాతావరణం నెలకొంది అని అన్నారు.

గ్రామంలో 20 ఇండ్ల కు గాను 19 ఇండ్లు నిర్మాణ దశలో ఉండడం ఆనందంగా ఉంది అని అన్నారు.గత బి అర్ ఎస్ ప్రభుత్వం లో గృహ లక్ష్మీ పథకం లో భాగంగా మంజూరైన ప్రొసీడింగ్ లకు సైతం నిధులు మంజూరుకు ముఖ్యమంత్రి జి.ఓ ఇచ్చారని లబ్ధిదారులకు మంచి శుభవార్త అని అన్నారు.

.ప్రభుత్వంతో పని చేసి జగిత్యాల అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు బొడ్డు దామోదర్, అంజా గౌడ్, నక్కహరీష్, శేఖర్,మాజీ ఏ యం సి డైరెక్టర్ తిరుపతి గౌడ్ ఆది రెడ్డి సల్ల శేఖర్ గౌడ్ మాజీ సర్పంచ్ సత్తయ్య పురుషోత్తం సత్తవ్వ రాము, చిరుత మహేశ్, మంచాల మల్లేశం,బొడ్డు రత్నాకర్,పొన్నాల మధుసూదన్, రంజిత్, తదితరులు పాల్గొన్నారు.

