మెప్మా భవనంలో మున్సిపల్ ఎన్నికల బ్యాలెట్ పేపర్లను పర్యవేక్షించిన జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్
నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
జగిత్యాల పట్టణంలోని మెప్మా భవనంలో రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల బ్యాలెట్ పేపర్ల ను జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజా గౌడ్ పర్యవేక్షించారు.మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా బ్యాలెట్ పేపర్ల ధృవీకరణ చేపట్టినట్లు తెలిపారు. నిర్దేశిత ఎన్నికల నిబంధనల ప్రకారం పరిశీలన ప్రక్రియ కొనసాగిందని తెలిపారు. బ్యాలెట్ పేపర్ల సీల్‌లు మరియు సీరియల్ నంబర్లను తనిఖీ చేశారు. సంబంధిత రికార్డులతో బ్యాలెట్ పేపర్ల వివరాలను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్పందన, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

