మెట్ పల్లి ప్రభుత్వ “డిగ్రీ” కళాశాలలో చేరండి.
నవగీతం, మెట్ పల్లి రూరల్:
ఓపెన్ ఇంటర్ లో ఉత్తీర్ణులైన విద్యార్థులు మెట్ పల్లి పట్టణంలోని వెంకట్రావుపేట లో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాలని ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే .వేంకయ్య విద్యార్థులకు పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని బండలింగాపూర్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉన్న “ఇంటర్ ఓపెన్ ” కేంద్రాన్ని శనివారం రోజున ప్రిన్సిపాల్ అధ్వర్యంలో కళాశాల సిబ్బంది సందర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీ ఏ; బీ. కాం. కోర్సులు ఉన్నాయని, డిగ్రీలో చేరటానికి “ఓపెన్ ఇంటర్” ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులని అన్నారు.డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణులైన విద్యార్థులు గ్రూపు – 1,2,3,4 వంటి పోటీ పరీక్షలతో పాటు సివిల్ సర్వీసులు, బ్యాంకింగ్, రైల్వే వంటి శాఖలలో నిర్వహించే పోటీ పరీక్షలకు హాజరు కావచ్చని ఆయన స్పష్టం చేశారు.అందువల్ల మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వెంటనే చేరాలని ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్య ఓపెన్ ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఓపెన్ ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు అన్ని రకాల పోటీ పరీక్షలు రాయటానికి అర్హులేనని, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కళాశాల వైస్ ప్రిన్సిపాల్ తొంటి దేవన్న పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో “ఓపెన్ ఇంటర్ ” నిర్వాహకులు, ఉన్నత పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీ పెరంబుదూరు లింబగిరి స్వామి, ఎం ఈ ఓ చంద్రశేఖర్ , శ్రీనివాస్, సంధ్య, వాజిద్ తదితరులు పాల్గొన్నారు.

