Thursday, February 26, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలకాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీ.

కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీ.

📰 Generate e-Paper Clip

అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్

మాజీ మంత్రి జువ్వాడి  విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీ ప్రారంభం

నవగీతం,కోరుట్ల:

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొంది మున్సిపల్ చేర్మెన్ గా ఎన్నికైన తిరుమల వసంత – గంగాధర్ కాంగ్రెస్ కౌన్సిలర్ తో కలిసి విజయోత్సవ ర్యాలీని నిర్వహించగా ఇట్టి ర్యాలీకి ముఖ్య అతిథులుగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు .కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు లు విచ్చేశారు.ముందుగా కోరుట్ల పట్టణ వెటర్నరీ కళాశాల ఆవరణలో గల స్వర్గీయ మాజీమంత్రి జువ్వాడి రత్నాకర్ రావు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

అనంతరం కోరుట్ల పట్టణ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం నుండి నంది చౌక్ కొత్త బస్టాండ్ మీదుగా డైమండ్ హోటల్ నుండి తిరిగి కొత్త బస్టాండ్ వద్దకు బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం కొత్త బస్టాండ్ వద్దగల అంబేద్కర్  విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగ్ రావు  మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తరుణంలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అలాగే మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడమే కాకుండా కోరుట్ల నియోజకవర్గం లోని కోరుట్ల మెట్ పల్లి మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని అందులో భాగంగానే కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ గా తిరుమల వసంత గంగాధర్ ను నియమించడం జరిగిందన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటుందని అన్నారు.రాబోయే ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా కృషి చేయాలన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కోరుట్ల నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి విచ్చేసి కౌన్సిలర్ల గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్క నాయకునికి కార్యకర్తలకు జువ్వాడి నర్సింగ్ రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని కావున ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం కృషి చేయాలని రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తామని సూచించారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి నర్సింగ్ రావు  జువ్వాడి కృష్ణా రావు తో పాటు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత గంగాధర్ ,వైస్ చైర్మన్. షాహిద్ ఉల్ అహ్మద్ కౌన్సిలర్లు. శీలం జయలక్ష్మి వేణుగోపాల్ పుప్పాల ఉమాదేవి ప్రభాకర్. దాసరి సునీత రాజశేఖర్. ఎడ్ల జలజ.రమేష్ రెంజర్ల కళ్యాణి, తెడ్డు శ్రీజ విజయ్. ఉమేరా కౌసర్ వాసిద్ సనా సుల్తానా రిజ్వాన్. మేడిపల్లి శిరీష శేఖర్ రెడ్డి. చిట్యాల లక్ష్మీనారాయణ.తోట గంగాధర్. వాసీద్. మోర్తాడ్ లక్ష్మీనారాయణ. తోట గంగాధర్ అబ్దుల్ రహీం.మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు వివిధ గ్రామాల సర్పంచులు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular