జగిత్యాల 22 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి చిట్ల అంజన్న
నవగీతం,జగిత్యాల ప్రతినిధి :
మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా నన్ను గెలిపిస్తే నాయకుడిగా కాకుండా సేవకుడిగా పనిచేసి మీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని జగిత్యాల మున్సిపల్ 22 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిట్ల అంజన్న అన్నారు. ఎన్నికల్లో తనను ఆశీర్వధించి కౌన్సిలర్ గా గెలిపిస్తే వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్థానని అంజన్న ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 22 వ వార్డులోని బట్టీవాడ, విద్యానగర్, రామాయలం వీధుల మీదుగా అన్నీ కాలనీల్లో బ్యాండ్ మేళంతో కాంగ్రెస్ నాయకులు, మహిళలు, యువకులు వెంటారాగా ఆదివారం అభ్యర్థి చిట్ల అంజన్న ఇంటింటి ప్రచారం చేసి చేతి గుర్తుకు ఓరువేసి కౌన్సిలర్ గా గెలిపించాలని ఓట్లు అభ్యర్తించారు.

వార్డులో డ్రైనేజి, రోడ్ల నిర్మాణం చేపడుతానని, త్రాగు నీటికి ఇబ్బందులు లేకుండా చూస్తానని, విధ్యుత్ దీపాలు అమర్చుతానని చెబుతూ వార్డులో అర్హులైన వారందరికీ వివిద రకాల పింఛన్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని అంజన్న ఓటర్లకు అభయామిచ్చారు. వార్డులో సమస్యలన్నీ నాకు తెలుసని,గత ఎన్నికల్లో ఓడినప్పటికి నిత్యం మీలో ఒకడిగా ఉండి నాయకుడిగా కాకుండా బాధ్యత కల పౌరుడిగా నావంతు బాధ్యతను నిర్వర్తిస్తూ అందరికి అందుబాటులో ఉంటున్నానని అంజన్న పేర్కొన్నారు.ఒక్కసారి అవకాశమిస్తే నాయకుడిగా కాకుండా సేవకుడిగా ఉండి పనిచేస్తూ 22 వ వార్డును జగిత్యాల మున్సిపాలిటీలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని అంజన్న పేర్కొన్నారు. విద్యానగర్, బట్టీవాడతో పాటు 22 వ వార్డులో చిట్ల అంజన్నకు నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు బ్రహ్మరతం పట్టారు. ఈనెల 11 న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటువేసి చిట్ల అంజన్నను ఈసారి ఎలాగైనా గెలిపించుకుంటామని ఓటర్లు మాట ఇచ్చారు. ప్రచారంలో యువకులు నాయకులు, చిట్ల మల్లేశం, చిట్ల శంకర్, సత్యనారాయణ రెడ్డి,గౌతమ్ రెడ్డి, సదశివా రెడ్డి,చంద్రమౌళి, నరేష్, లత, వాణి రావు,మంజుల, రమా, విజయ, శారద, లక్ష్మి, రవి, గంగాధర్, లింగారెడ్డి, తిరుపతి, గంగయ్య, తిరుపతి,దామోదర్ రెడ్డి, రాజశేఖర్,ఎన్నం కిషన్ రెడ్డి, శ్రీనివాస్, లింగారెడ్డి, రాజన్న,మహేశ్వర్ రెడ్డి పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.

