నవగీతం,మల్లాపూర్:
మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో స్థానిక గ్రామపంచాయతీ ఆవరణలో తపాల శాఖ పథకాలపై బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ దురిశెట్టి రాజేశం ఆధ్వర్యంలో తెలంగాణ చీఫ్ పోస్ట్మాస్టర్ ఆదేశాలకు అనుగుణంగా తపాలా శాఖ పథకాలపై గ్రామపంచాయతీ నూతన పాలకవర్గానికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దురిశెట్టి రాజేశం మాట్లాడుతూ.. తపాలాశాఖ చేపట్టిన బేటి బచావో బేటి పడావో, సుకన్య సమృద్ధి యోజన, ప్రధానమంత్రి సురక్ష యోజన, గ్రామీణ తపాలా బీమా యోజన, రికరింగ్ డిపాజిట్లు సేవింగ్ అకౌంట్ లో తదితర పథకాలు ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ పోస్టల్ బ్యాంకు ఖాతా తీయాలని మీకు ఎల్లప్పుడూ తపాలా శాఖ ద్వారా సేవలు అందజేయ బడతాయని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శంకరమ్మ ఆశాలు ఉపసర్పంచ్ ప్రణయ్ కార్యదర్శి అశోక్ కారోబార్ సత్యనారాయణ వార్డు సభ్యులు రేణుక సంజీవ్ రాములు లక్ష్మీనారాయణ శృతి జ్యోతి సామాజిక కార్యకర్త విష్ణువర్ధన్ రాజు తదితరులు పాల్గొన్నారు

