Thursday, February 26, 2026
ads
Homeతెలంగాణపెద్దపల్లినాయకుల భరోసా.. ప్రజల ఆశీర్వాదం

నాయకుల భరోసా.. ప్రజల ఆశీర్వాదం

📰 Generate e-Paper Clip

నాయకుల భరోసా.. ప్రజల ఆశీర్వాదం

నవగీతం, పెద్దపల్లి:

పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు ఎన్నికల రాజకీయం ఆసక్తికర మలుపు తిరిగింది.బీఆర్ఎస్ అభ్యర్థి కేడం వెంకట వరలక్ష్మి-కిషోర్ తరపున ఆ పార్టీ అగ్ర నాయకత్వం చేపట్టిన వ్యూహాత్మక ప్రచారం ఓటర్లలో బలమైన ముద్ర వేసినట్లు కనిపిస్తోంది.మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ మమతారెడ్డి సోమవారం స్వయంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రచారం నిర్వహించడం అభ్యర్థికి పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది.గత ప్రభుత్వ కాలంలో 10వ వార్డులో జరిగిన మౌలిక సదుపాయాల కల్పన మరియు ఇతర సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో నాయకులు సఫలీకృతులయ్యారు. అభివృద్ధి చేసిన వారికే మా ఓటుఅనే నినాదంతో ఓటర్లు అభ్యర్థికి బ్రహ్మరథం పట్టడం గమనార్హం. గత కొద్ది రోజులుగా సాగిన ప్రచార సరళిని పరిశీలిస్తే,వార్డు ప్రజలు బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది.అన్ని వర్గాల ప్రజల నుండి లభించిన అపూర్వ స్పందనతో కేడం వెంకట వరలక్ష్మి విజయం దాదాపు ఖాయమనే ధీమాను పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.వార్డు అభివృద్ధిని కాంక్షించే ఓటర్లు తమకే పట్టం కడతారని బీఆర్ఎస్ వర్గాలు విశ్వసిస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular