navageetam.com
Newspaper Banner
Date of Publish : 02 February 2026, 3:20 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

నూతన పోస్టల్ ఫ్రాంచైజీల కోసం దరఖాస్తుల ఆహ్వానం

పెద్దపల్లి డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ కె.శివాజీ

నవగీతం,పెద్దపల్లి:

పెద్దపల్లి పోస్టల్ డివిజన్ పరిధిలో సేవలను మరింత చేరువ చేసేందుకు భారత పోస్టల్ శాఖ నూతన ఫ్రాంచైజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.స్పీడ్ పోస్ట్,పార్సెల్ సర్వీస్, అంతర్జాతీయ మెయిల్ బుకింగ్ మరియు డెలివరీ వంటి సేవలను విస్తరించడమే లక్ష్యంగా కొత్త పోస్టల్ ఫ్రాంచైజీల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పెద్దపల్లి డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ కె.శివాజీ ఒక ప్రకటనలో తెలిపారు.ఆసక్తి గల అభ్యర్థులు భారత పోస్టల్ శాఖ అధికారిక వెబ్‌సైట్ indiapost.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలనీ తెలిపారు. వయస్సు 18 సంవత్సరాలు పైబడి కనీసం ఇంటర్మీడియట్, కేవలం డెలివరీ సేవల కోసం అయితే 10వ తరగతి ఉత్తీర్ణత.ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.ఈ పథకం ద్వారా కమిషన్ ఆధారిత ఆదాయం ప్రోత్సాహకాలు లభిస్తాయి అని వివరించారు. వివరాలకు సమీప పోస్టాఫీస్ గాని లేదా సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసు కార్యాలయము లో సంప్రదించాలని తెలిపారు.