Thursday, February 26, 2026
ads
Homeఎడిటోరియల్ప్రకృతిని కాపాడుకోవడం మానవుని బాధ్యత:

ప్రకృతిని కాపాడుకోవడం మానవుని బాధ్యత:

📰 Generate e-Paper Clip

ప్రజాకవి, కాళోజి అవార్డు గ్రహీత జయరాజ్

సామజిక సమస్యలన్నిటికీ శాస్త్రీయ దృక్పధం ఏకైక ఆయుధం: విజ్ఞానదర్శిని రమేష్

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

విశ్వంలో అంతర్భాగమై భూమిపై మానవ పరిణామంతో పాటు జీవజాతి మనుగడకు కారణమైన ప్రకృతిని కాపాడుకోవడం జీవజాతులన్నిటిలో ఉత్కృష్టమైన, విచక్షణ, వివేచనతో సమస్యలపై స్పందించి నిర్ణయాలు చేయగల మెదడు కలిగిన మానవుని బాధ్యత అని ప్రజాకవి, కాళోజి అవార్డు గ్రహీత జయరాజ్ అన్నారు.ప్రకృతిని రక్షించుకుంటే క్షేమం అదే ప్రకృతిని విస్మరిస్తే క్షామమని ఆయన అభిప్రాయపడ్డారు.ప్రకృతి రక్షణ, వైజ్ఞానిక దృక్పధం,హక్కులు కల్పించిన రాజ్యాంగ పరిరక్షణ లక్ష్యంగా భారత రాజ్యాంగం ఆర్టికల్ 51(ఏ-హెచ్)లో సైన్టిఫిక్ టెంపర్మెంట్ ను చేర్చి 80 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్బంగా నెహ్రు సెంటర్ ఢిల్లీ ఆధ్వర్యంలో విజ్ఞాదర్శిని సైన్స్ ఆర్గనైజషన్, అమ్మ నేత్ర, రక్త, శరీర దాన ప్రోత్సాహకుల సంఘం సభ్యులు తెలంగాణ రాష్ట్రంలో 33జిల్లాల్లో అవగాహన పెంపోందిచడమే ధ్యేయంగా గత నెల జనవరి 27న నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల వద్ద పర్యాటక శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు జండా ఊపి ప్రారంభించిన ప్రకృతి వైజ్ఞానిక యాత్ర శనివారం జగిత్యాల జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈసందర్బంగా జిల్లా కేంద్రంలోని డిగ్రీ మహిళా కళాశాల, ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల విద్యార్థులకు ప్రకృతిని కాపాడుకొనుటకు, రాజ్యాంగ పరిరక్షణ, శాస్త్రియదృక్పధం పెంపొందించడం పట్ల వేరువేరుగా శిక్షణా తరగతులు నిర్వహించారు.

కాళోజి పుష్కార గ్రహీత, ప్రముఖ ప్రకృతి కవి,సినీ గేయ రచయిత, వాగ్గేయ కారుడు జయరాజు మాట్లాడుతూ ప్రకృతితో మమేకమై జీవించాలని ,ఈ ప్రకృతిని పరిరక్షిస్తూ స్వచ్ఛమైన ప్రకృతిని ముందు తరాల వారికి అందించాలని అన్నారు. స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం, సమాన హక్కులు కల్పించిన భారత రాజ్యాంగం పట్ల ప్రతిపౌరుడు అవగాహన కలిగి ఉండాలన్నారు. విజ్ఞాన దర్శిని వ్యవస్థాపకుడు టీ. రమేష్ మాట్లాడుతూ ఏఐ కాలంలో జీవిస్తూ ఉన్నా అయినా ఇంకా మూఢనమ్మకాలు సమాజంలో నుండి పూర్తిగా తొలగిపోలేదని మూఢనమ్మకాల నడుమ గడుపుతున్నామని అన్నారు.

సామజిక సమస్యలన్నిటికీ శాస్త్రీయ దృక్పధం ఏకైక ఆయుధం, పరిష్కారమార్గమని అన్నారు. నేడు ఉన్నత చదువులు చదువుకున్న మేధావులు సైతం తమ నిత్యజీవితంలో సైన్స్ అన్వయించడం లేదని అదే నేడు సమస్య అయ్యి కూర్చుందని అవే అనాగరిక, అనైతిక మూఢ నమ్మకాలు పెచ్చరిళ్ళుటకు కారణం అన్నారు. వైజ్ఞానిక తెలంగాణ నిర్మాణానికి సైన్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో రమేష్ మ్యాజిక్ ప్రదర్శన ద్వారా ప్రయోగాత్మకంగా ప్రదర్శించి చూపారు. నమ్మకానికి, మూఢనమ్మకానికి మధ్య తేడాను ఆయన విద్యార్థులకు వివరించారు. అమ్మ నేత్ర అవయవ శరీర దాన ప్రోత్సాహకుల సంఘం అధ్యక్షుడు గంజి ఈశ్వరరావు మాట్లాడుతూ అవయవ దానాల ప్రాముఖ్యతల గురించి విద్యార్థులకు అవగాహన కలిగించాడు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్, అసిస్టెంట్ ప్రొఫెసర్ మధువాణి, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ డా. వరప్రసాద్,నర్సింగ్ కాలేజ్ ఫ్యాకల్టీ విజయలక్ష్మి, శైలజ, భవిత, ప్రసన్న, మనోజ్,అరుణ, జోష్న, అనూష, మహిళా డిగ్రీ కళాశాల ఎన్.ఎస్.ఎస్ విభాగం ప్రోగ్రాం ఆఫీసర్ డా. సుజాత, డా. శ్రీలత, డా. సంగీత రాణి, హెల్త్ క్లబ్ కోఆర్డినేటర్ జి. నీరజ,డా.వాసవి, రాంచందర్, మల్లికార్జున్,సోషల్ అక్టివిస్ట్ తెలంగాణ శ్యామ్, విజ్ఞాన దర్శిని సభ్యులు పెద్ది మహేశ్వర్ రెడ్డి, కళాకారుల బృందం గాయకులు జాన్,మద్దెల చంద్రశేఖర్, మధు తోపాటు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular