భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన పోలీసు అధికారులు
నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని పరీక్షల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పి అశోక్ కుమార్ తెలిపారు. పరీక్షలు పారదర్శకంగా, ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద సిబ్బంది బందోబస్త్, పెట్రోలింగ్ చేస్తూ పరీక్ష ముగిసే వరకు సిబ్బంది విధుల్లో ఉంటారని తెలిపారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని, వారికి అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించడంలో పోలీసు శాఖ సహకరిస్తుందని అన్నారు. పరీక్షా విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


