Sunday, March 1, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలబిజెపి అభ్యర్థుల బీ-ఫామ్ పత్రాలకు పూజలు

బిజెపి అభ్యర్థుల బీ-ఫామ్ పత్రాలకు పూజలు

📰 Generate e-Paper Clip

నవగీతం, మెట్ పల్లి;

మెట్ పల్లిలో మున్సిపల్ ఎన్నికల బీజేపీ అభ్యర్థులకు సంబంధించిన బీ-ఫాం పత్రాలకు మంగళవారం బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు పట్టణంలోని ఓంకారేశ్వర దేవాలయంలో, అక్కడే ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో సమర్పించారు.
కార్యక్రమంలో మెట్ పల్లి మున్సిపల్ ఎన్నికల ఇంచార్జీ అమ్దాపూర్ రాజేశ్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఏలేటి నరేందర్ రెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్, అసెంబ్లీ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular