బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధికార ప్రతినిధి ఉమా మహేష్
నవగీతం, జగిత్యాల ప్రతినిధి :
జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ చైర్మన్ పదవి బడుగు, బలహీన వర్గాలకు (బీసీ) కేటాయించాలనీ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధికార ప్రతినిధి, న్యాయవాది కూర్మాచలం ఉమా మహేష్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఉమా మహేష్ మాట్లాడుతూ…..కాంగ్రెస్ పార్టీ బీసీ లకు సముచిత స్థానం ఇవ్వాలని కోరారు. జనాభాలో 50 శాతం ఉన్న బీసీ సమాజానికి నేటికి సరైన రాజకీయ వాటా దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మపురి పట్టణంలో మెజార్టీ బీసీ ప్రజానీకం అని గుర్తు చేశారు. మంత్రి వర్యులు అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ గారికి ప్రతి ఎన్నికలో బీసీ సమాజం సంపూర్ణ మద్దతు తెలపడం జరిగిందని, ప్రస్తుతం జరిగిన ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో బీసీ సమాజం కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలపడం జరిగిందని అన్నారు. బీసీ లకు ధర్మపురి మున్సిపల్ చైర్మన్ పదవి కేటాయించాలని మంత్రి వర్యులు అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ ను ఈ సందర్భంగా ఉమా మహేష్ విజ్ఞప్తి చేశారు.

