Thursday, February 26, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలభవన నిర్మాణ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలి

భవన నిర్మాణ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలి

📰 Generate e-Paper Clip

జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఎశమేని గణేష్

నవగీతం, జగిత్యాల ప్రతినిధి :

భవన నిర్మాణ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఎశమేని గణేష్ కోరారు. ఏఐసీబీడబ్ల్యు జాతీయ కమిటీ నిర్ణయం మేరకు ఫిబ్రవరి 23న నిర్వహించనున్న ఆందోళన కార్యక్రమానికి సంబంధించి వినతి పత్రం సోమవారం మెట్ పల్లిలోని కార్మిక శాఖ అధికారి (లేబర్ ఆఫీసర్) ఆర్ క్రిష్ణసాగర్ కు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం భవన నిర్మాణ కార్మిక సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఎశమేని గణేష్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వివరిస్తూ ఎవరైతే కార్మికుడు మరణిస్తారో సహజ మరణానికి రూ. ఐదు లక్షలు, ప్రసూతి సహాయం, వివాహ కానుకలకు ఒక రూ. లక్ష వరకు పెంచాలని, అలాగే డెత్ క్లైమ్ ఇన్సూరెన్స్ ను ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పారని, దానిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డును కార్మిక సంఘాల సభ్యులతో పాలకమండలిని వెంటనే నియమించాలని, తెలంగాణలో జీవో నెంబర్ 12ను సవరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ఎండీ ఉస్మాన్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఏశమేని గణేష్, సమీర్, ఖాతా వినయ్, మాతంగి శ్రావణ్, చౌదరి శివకుమార్, జనగాం రమేష్, మారంపల్లి రాజశేఖర్, తులసి రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular