Thursday, February 26, 2026
ads
Homeఎడిటోరియల్మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు చేసిన జువ్వాడి కృష్ణారావు

మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు చేసిన జువ్వాడి కృష్ణారావు

📰 Generate e-Paper Clip

వివో మహిళా సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ

నవగీతం,మల్లాపూర్:

మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలో జరుగుతున్న శ్రీ మల్లన్న స్వామి జాతర కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వివో మహిళా సంఘం భవన నిర్మాణానికి ఏఎంసీ చైర్మన్ పుష్పలత నర్సయ్య, సర్పంచ్ పద్మ నర్సయ్య తో కలిసి భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా జువ్వాడి మాట్లాడుతూ మన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మహిళా సంఘాల బలోపేతానికి సంఘ భవనాలను నిర్మిస్తూ, మహిళాలు అన్ని రంగాల్లో ముందుండాలని వడ్డీ లేని రుణాలు అందిస్తూ మహిళలకు ఉపాధి అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నారాయణరెడ్డి, ఉప సర్పంచ్ గంగాధర్, వార్డ్ సభ్యులు,జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు జలపతి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఆనంద్, సోమయ్య ,గంగాధర్, మహిళా సంఘాల పెద్ద మనుషులు, కాంగ్రెస్ నాయకులు లక్ష్మారెడ్డి, దేవయ్య, రాజా తిరుపతి అంజయ్య, రాజ మల్లయ్య, కిరణ్, కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular