Thursday, February 26, 2026
ads
Homeఎడిటోరియల్మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం:

మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం:

📰 Generate e-Paper Clip

జువ్వాడి కృష్ణారావు

నవగీతం, మల్లాపూర్:

మహిళా సంఘాల బలోపేతానికి మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని సీనియర్ నాయకులు కృష్ణారావు అన్నారు.మల్లాపూర్ మండలంలోని రత్నాపూర్ గ్రామంలో మహిళా సంఘ భవన నిర్మాణానికి జువ్వాడి కృష్ణారావు భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ మహిళా సంఘాల బలోపేతానికి మహిళా సంఘాలు సమావేశాలు నిర్వహించుకోవడానికి ఈ సంఘ భవనాలు ఎంతో ఉపయోగపడతాయని ప్రజా ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నల్ల రాజన్న , రత్నాపూర్ గ్రామ సర్పంచ్ గొండ రాజేందర్ గ్రామ వార్డ్ మెంబర్స్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మల్లయ్య ,యువ నాయకులు చర్ల సతీష్, బాస మహేందర్ ,బోడ మల్లేష్ బోడ,నడికుడ రాజేందర్ లింగన్న, గ్రామ మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular