Thursday, February 26, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలమహిళల అభివృద్ధి తోనే సమాజం అభివృద్ధి : జువ్వాడి కృష్ణరావు

మహిళల అభివృద్ధి తోనే సమాజం అభివృద్ధి : జువ్వాడి కృష్ణరావు

📰 Generate e-Paper Clip

నవగీతం, మల్లాపూర్:

మహిళలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందుతేనే సమాజం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు. మల్లాపూర్ మండలంలోని సిరిపూర్ గ్రామంలో గురువారం రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న మూడు వివో ఏ భవనాలకు స్థానిక సర్పంచ్ పెంట సౌజన్య శ్రీనివాస్, మల్లాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ అంతడుపుల పుష్పలత నరసయ్య తో కలిసి భూమి పూజ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ మహిళాలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందితేనే సమాజం బాగుపడుతుందని అభివృద్ధి చెందుతుందని అన్నారు.అలాగే ప్రభుత్వ నుండి మహిళా సంఘాలకు అందాల్సిన వడ్డీ లేని రుణం కావచ్చు ఇతరత్రా ఉపాధి, సంక్షేమ కార్యక్రమాలుప్రభుత్వం ద్వార అందించేందుకు తాము బాధ్యత తీసుకుంటామని అన్నారు.

అనంతరం ఇదే మండలంలోని రాఘవపేట గ్రామంలో పెద్దమ్మ జాతర ఉత్సవాలలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పెంట సౌజన్య శ్రీనివాస్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అంతడుపుల పుష్పలత నరసయ్య స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ నల్ల బాపు రెడ్డి, ఉప సర్పంచ్ సోమ నాగార్జున రెడ్డి, గడ్డం లక్పతి రెడ్డి డప్పుల నరసయ్య, నత్తి రాము నత్తి లక్ష్మణ్, గడ్డం శ్రీధర్ రెడ్డి, వార్డు సభ్యులు ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular