ఎంపీడీవో కు వినతిపత్రం అందజేసిన వడ్డెర కులస్తులు
నవగీతం,మల్లాపూర్:
మల్లాపూర్ మండలం వడ్డెర కులానికి చెందిన యువకులు తమ కులానికి అన్యాయం చెయ్యొద్దంటూ మల్లాపూర్ ఎంపిడిఓ శ్రీకాంత్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా మేము గత 70 ఏళ్లుగా మా కులవృత్తి తో రాళ్ళు కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్నామని అయితే ఇప్పుడు ప్రభుత్వం ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ ద్వారా మాకు చెందాల్సిన పనిముట్లైన టూల్స్, జనరేటర్, స్కూటీలు తుర్క కాశ ముస్లిం వర్గాలకు సబ్సిడీ అందచేస్తుందని దీనివలన వడ్డెర కులానికి చెందినవారు తీవ్రంగా నష్ట పోతున్నారని ఈ స్కీమ్ లో మాకు కూడా భాగస్వామ్యం కల్పించి మమ్మల్ని ఆదుకోగలరని వినతి పత్రంలో పేర్కొన్నారు. కులవృత్తులు అనేవి కేవలం ఉపాది మాత్రమే కావని సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచేవని, తరతరాలుగా ఒక్కరు చేయాల్సిన పనిని పనిముట్లను ఇంకొక వర్గానికి కేటాయించడమంటే వారి పొట్టకొట్టడమే కాదని సంస్కృతులను నాశనం చేయడమేనని పేర్కొన్నారు . ఎన్నికల మ్యానిఫెస్టోలో తమకు ఇచ్చిన వాగ్దానాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎంపిడిఓను కోరారు.

