Thursday, February 26, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలమున్సిపల్ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి

మున్సిపల్ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి

📰 Generate e-Paper Clip

ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి

జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బీ. సత్యప్రసాద్

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి బీ. సత్యప్రసాద్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి బీ. సత్యప్రసాద్ ఆర్వోలకు, ఏఆర్వోలకు, కౌంటింగ్ అధికారులు, సూపర్వైజర్స్, అసిస్టెంట్ సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ ట్రైనింగ్ కార్యక్రమాన్ని వీడియో పవర్ ప్రెజెంటేషన్ ద్వారా అవగహన కల్పిస్తూ ఎన్నికల విధుల పట్ల దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి బీ. సత్యప్రసాద్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలంటే నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో పోలింగ్ చాలా ముఖ్యమైన అంశమని, ప్రతి అంశం నిబంధనల ప్రకారం జరిగేలా చూడాలని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన కరపత్రాలు, గోడ పత్రాలు, ప్రచార వాహనాల అనుమతులను తీసుకోవాలంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని తెలిపారు. శిక్షణ పొందుతున్న ప్రతి అధికారి ప్రతి చిన్న అంశాన్ని, వారికి కలిగే సందేహాలను శిక్షణలో పూర్తి స్థాయిలో విచారించి అన్నింటిపైన పూర్తి స్థాయిలో అవగాహనా పొందాలన్నారు. ట్రైనింగ్ హల్ నుంచి పూర్తి అవగాహనతో బయటకు వెళ్లాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమవాళికి లోబడి మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరుగకుండా పగడ్బందీగా ఎన్నికలు నిర్వహించుటకు అధికారులు సమన్వయంతో క్షేత్ర స్థాయిలో పనిచేయాలని అన్నారు. పోలింగ్ జరిగే సమయంలో పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్సర్వర్లు, వెబ్ క్యాస్టింగ్ పాత్ర చాలా కీలకం అన్నారు. పోలింగ్ కు సంబంధించిన అన్ని రకాల మెటీరియల్ ను, అన్ని రకాల పత్రాలను డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లోనే సమకూర్చుకోవాలని ఎలాంటి గ్యాప్ లేకుండా చూసుకోవాలని కోరారు. అలాగే కౌంటింగ్ రోజున కౌంటింగ్ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్, కౌంటింగ్ ప్రశాంతంగా జరిగే విధంగా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) బీ. రాజ గౌడ్, జిల్లా నోడల్ అధికారి రవి కుమార్, టివోటిలు, జిల్లా ఎన్నికల విభాగం, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular