Thursday, February 26, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఓట్ల లెక్కింపుకు పటిష్ట బందోబస్తు

ఓట్ల లెక్కింపుకు పటిష్ట బందోబస్తు

📰 Generate e-Paper Clip

450 పోలీసులతో నిఘా

విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం

జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

 

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా 450 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రం అయిన ఎస్ కె ఎన్ అర్ డిగ్రీ కాలేజీ వద్ద ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ తో కలిసి పరిశీలించారు.

ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మూడంచెల భద్రత నిర్వహిస్తున్నామని తెలిపారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  163 బి ఎన్ ఎస్ ఎస్  (144  సెక్షన్ అమలు) అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ యొక్క 163 బి ఎన్ ఎస్ ఎస్  సెక్షన్ రేపు ఉదయం 6 గంటల నుండి శనివారం ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటుందని తెలిపారు.ఈ సెక్షన్ అమలులో ఉన్నప్పుడు ధర్నాలు, రాస్తారోకోలు, ఊరేగింపులు, టపాకాయలు కాల్చడం, సభలు, సమావేశాలు, విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధమని వాటిని నిర్వహించ కూడదని తెలిపారు.

నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు..ఓట్ల లెక్కింపు కేంద్రమైన ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కాలేజీ పరిసర ప్రాంతాలను డాగ్స్ స్క్వాడ్, బాంబు డిస్పోజల్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపునకు హాజరు అయే అభ్యర్థులు, ఏజెంట్లు, నిషేధిత వస్తువుల అయిన అగ్గిపెట్టెలు, లైటర్,ఇంక్ బాటల్స్, పేలుడు కారణం అయే ఎలాంటి  వస్తువులను లెక్కింపు కేంద్రాల్లోకి తీసుకురాకూడదని తెలిపారు తనిఖీలు చేసే సిబ్బందికి సహకరించాలని కోరారు. ఎలక్షన్ కమిషన్ ద్వారా జారీ చేయబడిన గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే లెక్కింపు కేంద్రంలోకి  అనుమతి ఉంటుంది అన్నారు. ఈ యొక్క కార్యక్రమం లో డిఎస్పి లు రఘు చందర్, రాములు ఇన్స్పెక్టర్ లు, ఎస్.ఐ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular