Thursday, February 26, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలమెట్‌పల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌లకు మెప్మా ఆర్‌పీల సన్మానం

మెట్‌పల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌లకు మెప్మా ఆర్‌పీల సన్మానం

📰 Generate e-Paper Clip

నవగీతం, మెట్ పల్లి:

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో, నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకారి నవీన్‌లను మెప్మా (MEPMA) ఆర్‌పీలు మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛాలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వడి నర్సింగరావు మాట్లాడుతూ, మున్సిపాలిటీ పరిధిలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి మాట్లాడుతూ …నేను సంపాదన కోసం కాదు, ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ పరస్పర సహకారంతో మెట్‌పల్లి పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాను. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని విభాగాల సిబ్బందిని కలుపుకుని పట్టణాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతాం అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మెప్మా విభాగానికి చెందిన టీఎంసీ సోమిడి శివ, ఆర్‌పీలు (రిసోర్స్ పర్సన్స్), ఓబీలు శ్రీదేవి, ప్రేమలత, శోభ, పద్మ, సుజాత, అమల, జ్యోతి, లక్ష్మి, సరోజ, లత, ప్రశాంతి, గీత, లహరి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular