Thursday, February 26, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలవార్డులో సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి

వార్డులో సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి

📰 Generate e-Paper Clip

నవగీతం, మెట్ పల్లి

మెట్ పల్లి పట్టణంలోని మూడో వార్డులో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వార్డు ప్రజలు మంగళవారం మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ మోహన్ కు వినతిపత్రం సమర్పించారు. వార్డులో ప్రధాన సమస్య అయిన మంచినీటి కొరత తీర్చడానికి 3 బోర్లు వేయించాలని కోరారు. వార్డులోని ప్యాట బాబయ్య ఇంటి నుండి మొదలుకొని బర్ల సాయన్న ఇంటి వరకు గల డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బర్ల సూరి, బర్ల ప్రశాంత్, బర్ల అర్జున్, ఎర్ర మనిదీప్, తరి అక్షయ్, చెర్లపెల్లి పృథ్వి, అంతడ్పుల రాము, పత్రి విజయ్, వైఎంఎస్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular