Thursday, February 26, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలవాల్మీకి ఆవాస విద్యార్థులకు స్కాలర్షిప్ లు పంపిణీ.

వాల్మీకి ఆవాస విద్యార్థులకు స్కాలర్షిప్ లు పంపిణీ.

📰 Generate e-Paper Clip

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

సేవాభారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాస విద్యార్థులకు కెనడాలో నివాసముంటున్న వైద్య దంపతులు రూ. 42,000 స్కాలర్షిప్లను అందజేశారు. కెనడా లో వైద్యవృత్తి లో ఉన్న డా.తాటి పెళ్లి అనురాగ్ డా. హారిక దంపతులు ఆవాసం లో విద్యను అభ్యసిస్తున్న 12 మంది మెరిట్ విద్యార్థులకు రూ.3500 చొప్పున మొత్తం రూ.42 వేలను కరీంనగర్ కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కట్కం శ్రీనివాస్ ద్వారా ఆవాసం కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ నిరుపేద విద్యార్థుల కోసం గత 32 సంవత్సరాలుగా విలువలతో కూడిన విద్యను అందిస్తూ ఉత్తమ పౌరులు గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న వాల్మీకి ఆవాసానికి తమ వంతు చేయూతను అందించాలనే ఉద్దేశంతో నిరుపేద విద్యార్థులకు స్కాలర్షిప్ ను అందించడం జరిగిందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular