Thursday, February 26, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలవైభవంగా శివపార్వతుల కళ్యాణం

వైభవంగా శివపార్వతుల కళ్యాణం

📰 Generate e-Paper Clip

అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు

నవగీతం, మల్లాపూర్:

మల్లాపూర్ మండల కేంద్రంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన అతి పురాతన కనక సోమేశ్వర స్వామి దేవాలయం సోమన్న గుట్ట మీద ఆదివారం మహా శివరాత్రిని పురస్కరించుకొని శివ పార్వతుల కళ్యాణం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.అర్చకులు ప్రభాకర్ శర్మ , ప్రత్యేక అర్చకులు శశికాంత్ శర్మ చేతుల మీదుగా కళ్యాణం నిర్వహించారు. ఈ కళ్యాణంలో ఎస్సై అనీల్ దంపతులు ,సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ దంపతులు,ఉపసర్పంచ్ సోమరెడ్డి దంపతులు,కమిటీ సభ్యులు జీవన్ రెడ్డి దంపతులు, తిరుపతి దంపతులు, స్వాములు కైరా నాగేష్ దంపతులు, రాజన్న దంపతులు, సోమయ్య దంపతులు, 20 మంది దంపతులు కమిటీ చైర్మన్ సంగ గంగరాజం,వైస్ చెర్మెన్ తుక్కారం,శివ స్వాములు నాగరాజు రమేష్ రామ్ కిషన్ నరేష్ విజయ్ సోమేశ్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular