నవగీతం, మల్లాపూర్:
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో నలుగురు మహిళలు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ప్రమాద సంఘటన స్థలానికి హుటాహుటిన కల్వకుంట్ల సుజిత్ రావు చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గాయపడ్డ వారికీ మెరుగైన వైద్య సేవల కొరకు వైద్య సిబ్బంది తో ఫోన్ లో మాట్లాడారు.బాధితులకు అన్ని రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

