Thursday, February 26, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలసామాజిక సేవ నుండి... ప్రజాసేవలోకి

సామాజిక సేవ నుండి… ప్రజాసేవలోకి

📰 Generate e-Paper Clip

అభాగ్యులకు అండగా అరిగేల రాకేష్

సైనిక్ ఫౌండేషన్ తో కలిసి సామాజిక సేవా కార్యక్రమాలు

ఎన్నికల్లో గెలిపిస్తే మరింత సేవలు విస్తరిస్తానంటున్న రాకేష్

15వ వార్డులో ప్రచారంలో దూసుకుపోతున్న బీజేపీ అభ్యర్థి అరిగేల అనూష రాకేష్

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లా మెట్ పల్లికి చెందిన అరిగెల రాకేష్. సమాజానికి ఏదైనా సేవ చేయాలి, అభాగ్యులకు అండగా ఉండాలన్న లక్ష్యంతో సామాజిక సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. బాల్యంలోనే తండ్రిని కోల్పోయిన అరిగెల రాకేష్ ఒకానొక సమయంలో పూట గడవడం కష్టంగా మారడంతో కుటుంబానికి అండగా నిలవాల్సి వచ్చింది. ఆ స్థితిలో ఆయన ఇంటర్ లోనే విద్యని ఆపేసి కుటుంబం కోసం ఎలక్ట్రిక్ షాప్ లో వర్కర్ గా చేరారు. అనంతరం వివిధ రకాల పనులు చేస్తూనే కాలం వెల్లదీశారు. ఇక పెళ్ళి తరువాత ఆర్థిక కష్టాల దృష్ట్యా కుటుంబ పోషణకై గల్ఫ్ వెళ్ళి కొన్ని సంవత్సరాల తర్వాత స్వదేశం వచ్చి హోల్ సెల్ కిరాణా షాప్ ప్రారంభించి తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారి జీవితంలో ఒక స్థాయికి ఎదిగారు. తాను ఎదిగిన తర్వాత తనలాగా ఎవరూ కష్టాలు పడకూడదు అనే ఉద్దేశ్యంతో తన చిన్ననాటి మిత్రుడు బాస చంద్రశేఖర్ తో కలిసి సౌనిక్ ఫౌండేషన్ స్థాపించి పేదవారికి సహాయ పడుతూ వచ్చారు. సేవా దృక్పథంతో ఉన్న రాకేష్ కు అధికారం ఉంటే ఇంక ఎంతో మందికి సహయపడవచ్చు అని భావించి కౌన్సిలర్ గా 15వ వార్డు నుండి బరిలో నిలిచారు.

సైనిక్ ఫౌండేషన్ తో కలిసి సామాజిక సేవ కార్యక్రమాలు

పేద ప్రజలకు సాయం చేయాలన్న సంకల్పంతో మెట్ పల్లిలో 2024 ఆగస్టులో సైనిక్ ఫౌండేషన్ ప్రారంభించారు. ఇందులో మొదటగా కొంతమంది మిత్రులతో కలిసి సొంత డబ్బులతో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం ప్రారంభించారు.

ఫౌండేషన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు వందలాదిమందికి ఆర్థిక సహాయం, పేదలకు నిత్యవసర వస్తువులు, అభాగ్యులకు అవసరమైన సహకారాన్ని అందిస్తూ తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. భవిష్యత్తులో ఫౌండేషన్ ను రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తింపజేసి అవసరమైన ప్రతి ఒక్కరికి సేవ కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక ప్రణాళిక ద్వారా ముందుకెళ్తున్నారు.

ఎన్నికల్లో గెలిపిస్తే మరింత సేవలు విస్తరిస్తానంటున్న రాకేష్.

మొదటి నుంచి సమాజసేవ చేయాలన్న సంకల్పంతో ఫౌండేషన్ ఏర్పాటు చేసిన రాకేష్ మరియు అతని మిత్రబృంద సభ్యులు సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నారు. అయితే ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో బరిలో ఉన్న అరిగెల రాకేష్ తనకు మున్సిపల్ కౌన్సిలర్ గా అవకాశం ఇస్తే ప్రజాసేవ చేయడానికి మరింత బలం చేకూరుతుందని పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు వార్డులో పలు ప్రాంతాల్లో సొంత డబ్బులు వెచ్చించి అవసరమైన అభివృద్ధి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టానని, ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే వార్డును జిల్లాలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని పేర్కొంటున్నారు.

15వ వార్డులో ప్రచారంలో దూసుకుపోతున్న బీజేపీ అభ్యర్థి అరిగెల అనూష రాకేష్

మెట్ పల్లి మున్సిపల్ సాధారణ ఎన్నికల్లో భాగంగా పట్టణంలోని 15వ వార్డులో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అరిగెల అనూష రాకేష్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను కలుస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అరిగెల అనూష రాకేష్ కు వార్డు ప్రజల నుండి విశేష స్పందన వస్తుండడంతో మున్సిపల్ ఎనికల్లో గెలుపు ఖాయమన్న సంకేతాలు వినిపిస్తున్నాయి.

ఒక్కసారి అవకాశం ఇవ్వండి… అరిగెల అనూష రాకేష్ బిజెపి 15వ వార్డు అభ్యర్థి,

ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో మాకు ఒక అవకాశం ఇవ్వండి. ఇప్పటివరకు ఎవరు చూడనటువంటి అభివృద్ధి చేసి చూపిస్తాను.. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తాను. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని వార్డులోని అర్హులైన ప్రజలకు అందించడానికి ముందుండి కృషి చేస్తాను. వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా నా దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి సైనికుడిలా పనిచేస్తాను. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాను.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular