నవగీతం,జగిత్యాల ప్రతినిధి:
జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ శివారులో గల సోషల్ వెల్ఫేర్ డిగ్రీ మహిళ కళాశాల ప్రిన్సిపాల్ గునుక శ్రీలత తన సబ్జెక్ట్ అయిన రసాయన శాస్త్ర విభాగం లో “సింతసిస్ అండ్ బయాలజికల్ ఇవాల్యూషన్ అఫ్ నావెల్ హేటిరో సైక్లిక్ కాంపౌండ్స్” అనే అంశాన్ని తన గైడ్ అయిన డా. అలియా బేగం పర్యవేక్షణలో పరిశోదన చేసి ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ ను సాధించారు. వీరు సాధించిన ఈ ఘనతను వారి కుటుంబ సభ్యులు మరియు బందు మిత్రులు డా. గునుక శ్రీలతను అభినందించారు.

