మాజీ మంత్రి జీవన్ రెడ్డి.
నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
స్పోర్ట్స్ సెంటర్లను యువత వినియోగించుకోవాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని భాగ్యరాజ్ ఫంక్షన్ హాల్ ఎదురుగా “ది స్పోర్ట్స్ ఎరీనా క్రికెట్ బాక్స్” ను మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ సమిల్ల వాణీ శ్రీనివాస్ లు ప్రారంభించగా గ్రాండ్ షటిల్ బాక్స్ ను మాజీ జెడ్పి చైర్మన్ దావ వసంత సురేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల వల్ల మానసిక శారీరక ఆరోగ్యం పెంపొందుతుందని,యువత తమకు అందుబాటులో ఉన్న స్పోర్ట్స్ కేంద్రాలను సద్వినియోగం చేసుకొని క్రీడల్లో నైపుణ్యం పెంచుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక ఉప సర్పంచ్ పెద్దూరు స్వతంత్ర మహేష్, స్పోర్ట్స్ సెంటర్ నిర్వాహకులు దొండపాటి జనార్ధన్ రెడ్డి సరళ తో పాటు తెలంగాణ రాష్ట్ర బీసీ రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ, అనుమల్ల రమేష్, మాజీ కౌన్సిలర్ గాజుల నగేష్, బండి సత్యం, అత్తినేని రాజేంద్రప్రసాద్ ,వేముల సురేందర్, బ్రాహ్మణపల్లి రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.

