Thursday, February 26, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలస్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల కోసం ఫ్లాగ్ మార్చ్: డిఎస్పి రాములు

స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల కోసం ఫ్లాగ్ మార్చ్: డిఎస్పి రాములు

📰 Generate e-Paper Clip

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు మెట్ పల్లి పట్టణంలో  ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మెట్ పల్లి డిఎస్పి రాములు మాట్లాడుతూ ప్రతి ఓటరు ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి.

శాంతి భద్రతకు ప్రాధాన్యమిస్తూ, ఓటర్లలో నమ్మకం పెంపొందించడం మా ప్రధాన ఉద్దేశం ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడానికి ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. ఎన్నికల కమిషన్ సూచించిన మార్గదర్శకాల ప్రకారం స్వేచ్చాయుతగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన, గొడవలు సృష్టించాలని చూసిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని హెచ్చరించారు. ప్రజలంతా ఎలక్షన్ సమయంలో పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఫ్లాగ్ మార్చ్ లో సి.ఐ లు అనిల్ కుమార్, సురేష్ బాబు,ఎస్.ఐ లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular