నవగీతం, మెట్ పల్లి :
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని 15వ వార్డులో మున్సిపల్ ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక పారిశుధ్య పనులను నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది వార్డులోని పలు కాలనీల్లో మురికి కాలువలను శుభ్రం చేశారు. మురుగు కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగించారు. రహదారులను శుభ్రం చేయించారు. పారిశుద్ధ్య పనులను బీజేపీ నాయకులు అరిగెల రాకేష్ పర్యవేక్షణ చేశారు. వార్డును పరిశుభ్రంగా ఉంచడానికి నిరంతరం అవసరమైన కృషి చేస్తామని పేర్కొన్నారు.

