Monday, March 9, 2026
ads
Homeఆర్టికల్స్అక్రమంగా నివసిస్తున్న భారతీయులకు ఆ దేశం హెచ్చరిక

అక్రమంగా నివసిస్తున్న భారతీయులకు ఆ దేశం హెచ్చరిక

📰 Generate e-Paper Clip

ఏప్రిల్ 30 లోపు దేశం వదిలి వెళ్లకుంటే అరెస్ట్

నవగీతం, హైదరాబాద్ :

మలేషియాలో సరైన వీసా పత్రాలు లేకుండా లేదా వీసా గడువు ముగిసినా అక్కడే నివసిస్తున్న భారతీయ పౌరులకు ఆ దేశంలోని ఎన్నారై సంఘాలు అత్యవసర హెచ్చరిక జారీ చేశాయి. మలేషియా ప్రభుత్వం కల్పించిన ఈ ప్రత్యేక అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఎటువంటి చట్టపరమైన ఇబ్బందులు లేకుండా భారత్‌కు తిరిగి రావాలని కోరుతున్నాయి.

ప్రభుత్వ రాయితీ పథకం – PRM 2.0:

మలేషియా ప్రభుత్వం ప్రస్తుతం ‘మైగ్రెంట్ రిపాట్రియేషన్ ప్రోగ్రామ్ 2.0’ (PRM 2.0) అనే ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, పత్రాలు లేని వలసదారులు ఎటువంటి జైలు శిక్ష లేదా కఠినమైన విచారణలు ఎదుర్కోనే అవసరం లేకుండానే తమ స్వదేశాలకు తిరిగి వెళ్లేలా ప్రోత్సహించడం. ఈ పథకం గడువు ఈ ఏడాది ఏప్రిల్ 30, 2026తో ముగియనుంది. ఈ లోపు దరఖాస్తు చేసుకున్న వారు కేవలం నామమాత్రపు జరిమానా చెల్లించి చట్టబద్ధంగా విమానం ఎక్కవచ్చు.

మలేషియాలో ఆన్ డాక్యుమెంట్ మైగ్రేట్న్స్కు గడువు దాటితే ఎదురయ్యే పరిణామాలు:

ఏప్రిల్ 30వ తేదీ లోపు ఈ అవకాశాన్ని వాడుకోని వారిపై మలేషియా అధికారులు కఠినంగా వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయి. గడువు ముగిసిన వెంటనే దేశవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టి, అక్రమ వలసదారులను గుర్తించి అరెస్ట్ చేసే (Detention) అవకాశం ఉంది. ఒకసారి అరెస్ట్ అయితే భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి రావచ్చు అని స్వదేశ్ పరికిపండ్ల మీడియాకు తెలిపారు . ఇది భారతీయులకు లభించిన చివరి, అత్యంత సురక్షితమైన అవకాశం. గౌరవప్రదంగా సొంత ఊరికి వెళ్లాలనుకునే వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి” అని పిలుపునిచ్చారు. మలేషియాలో ఉన్న భారతీయుల కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని గమనించి, అక్కడ ఉన్న తమ బంధువులకు వెంటనే సమాచారం చేరవేసి, వారు తిరిగి వచ్చేలా ప్రోత్సహించాలని అయన కోరుతున్నారు.

పాస్‌పోర్ట్ లేని వారికి ప్రత్యేక సదుపాయం:

చాలా మంది భారతీయుల వద్ద పాస్‌పోర్టులు పోవడం లేదా చెల్లుబాటు కాకపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. అటువంటి వారి కోసం కౌలాలంపూర్‌లోని భారత హైకమిషన్ (High Commission of India) ప్రత్యేకంగా ‘ఎమర్జెన్సీ సర్టిఫికెట్లు’ (EC) జారీ చేస్తోంది. ఈ సర్టిఫికెట్ ఉంటే పాస్‌పోర్ట్ లేకపోయినా సురక్షితంగా భారత్‌కు చేరుకోవచ్చు. దీనికి సంబంధించిన సమాచారం కోసం ఎన్నారై సంఘాలను లేదా హైకమిషన్‌ను సంప్రదించవచ్చు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular