Wednesday, March 11, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఇంకుడు గుంతల నిర్మాణానికి అవగాహన

ఇంకుడు గుంతల నిర్మాణానికి అవగాహన

📰 Generate e-Paper Clip

నవగీతం, మల్లాపూర్:

మల్లాపూర్ మండలం గుండంపల్లి లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టాలని అవగాహన కల్పిస్తూ వాటి యొక్క ఉపయోగాలను వివరిస్తూ ఇంకుడు గుంతలను నిర్మించారు. మురుగునీటి కాలువల నుండి చెత్త చెదరం తొలగించి మురుగునీటి కాలువల వెంబడి బ్లీచింగ్ పౌడర్ చల్లి పరిశుభ్రంగా చేశారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి తండా జగదీష్ పాల్గొని గ్రామంలోని మహిళా సంఘం భవనం పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య ,పంచాయతీ కార్యదర్శి నారాయణ రెడ్డి ,ఏఎంసీ చైర్మన్ అంతడ్పుల పుష్పలత నర్సయ్య ఉప  సర్పంచ్ జగ్గుల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular