నవగీతం, మల్లాపూర్:
మల్లాపూర్ మండలంగుండంపల్లి గ్రామంలో గురువారం పశువులకు ఉచిత గాలికుంటు నివారణ టీకాలను ముత్యంపేట్ ప్రాథమిక పశు వైద్యశాల డాక్టర్ అశోక్ ఆధ్వర్యంలో గ్రామంలోని పశువులకు ఉచిత గాలికుంటు నివారణ టీకాలు వేసారు.ఈ కార్యక్రమంలో గో జాతి పశువులు 10 మరియు గేదె జాతి పశువులు 121 కలిపి మొత్తం 131 పశువులకు టీకాలు వేశామని ఈ టీకా కార్యక్రమం ద్వారా గ్రామంలోని పశువులను గాలికుంటు వ్యాధి నుంచి రక్షించడానికి చర్యలు తీసుకున్నామని పశు వైద్యాధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ సర్పంచ్ డప్పుల పద్మా నరసయ్య , పశు వైద్య సిబ్బంది డాక్టర్ జి. అశోక్, జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ ఇక్బాల్ , అలాగే పశు వైద్య సిబ్బంది మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.

