Wednesday, March 11, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఎన్నారై అడ్వయిజరీ కమిటీ పర్యటనకు ప్రభుత్వం తక్షణమే ఏర్పాట్లు చేయాలి

ఎన్నారై అడ్వయిజరీ కమిటీ పర్యటనకు ప్రభుత్వం తక్షణమే ఏర్పాట్లు చేయాలి

📰 Generate e-Paper Clip

యూఏఈ అధ్యక్షుడు బత్తిని రాజాగౌడ్ ఆవేదన

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గల్ఫ్ కార్మికులకు ప్రభుత్వపరంగా అందుతున్న సేవలు,సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించడం కోసం తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ బృందం మార్చి12,13 తేదీల్లో ఏపీ పర్యటన చేపట్టడానికి జిఏడి ఎన్నారై డిప్యూటీ ప్రోటోకాల్ మెంబర్ సెక్రెటరీకి,అదేవిధంగా ప్రిన్సిపల్ జి ఏ డి సెక్రెటరీ కి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఏపీ ఎన్నార్టీ సంస్థ, ఓంక్యాప్ సంస్థ, పోలీస్ శాఖ లోని ఎన్నారై విభాగం,24 గంటల హెల్ప్ లైన్, రూ.10 లక్షల ప్రమాద బీమా (ప్రవాసాంధ్ర భరోసా బీమా) గురించి అధ్యయన కోసం.అయితే పది రోజులు గడిచిన ఏపీ టూర్ గురించి ఎటు తేల్చకపోవడం పై ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ యూఏఈ అధ్యక్షుడు బత్తిని రాజాగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ ద్వారా దుబాయ్ నుండి ఇది గల్ఫ్ దేశాల్లో ఉన్న 15 లక్షల కార్మికులను అవమానించినట్లే అవుతుందని అన్నారు. కొంతమంది అధికారుల పనితీరు వల్ల ప్రభుత్వానికి నష్టం జరిగే అవకాశం ఉందని రాజా గౌడ్ అన్నారు.వెంటనే ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్విజన్ కమిటీ ఇచ్చిన దరఖాస్తు పరిశీలించి ఆంధ్ర ప్రదేశ్ పర్యటనకు సంబంధించిన విషయంపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular