నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
మెట్‌పల్లి డివిజన్ ఆర్డీవోగా జి. నరసింహరావు బాధ్యతలు స్వీకరించిన అనంతరం జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయాలని ప్రజలకు పారదర్శక, వేగవంతమైన సేవలు అందించి రెవెన్యూ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.

