Thursday, March 12, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలకళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

📰 Generate e-Paper Clip

నవగీతం, మల్లాపూర్:

మల్లాపూర్ మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో  మండలానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి – షాది ముబారక్  చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్  పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని తెలిపారు. రైతుల సంక్షేమం, మహిళల సాధికారత, పేద కుటుంబాల సంక్షేమం కోసం ఎన్నో చారిత్రాత్మక పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు.

పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి -షాది ముబారక్ పథకాలు వేలాది కుటుంబాలకు అండగా నిలిచాయని ఎమ్మెల్యే  పేర్కొన్నారు. మొత్తం రూ.35,04,060/- విలువగల 35 కళ్యాణ లక్ష్మి ,షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తీసుకువచ్చిన ఎన్నో పథకాలు తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపాయని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ , వేంపల్లి సర్పంచ్ రాజేందర్, బీఆర్ఎస్ నాయకులు న్యామాతాబాద్ రాజు, రంగు రామ గౌడ్, ముద్దం శరత్ గౌడ్,బండి లింగ స్వామి గౌడ్, పెద్దిరెడ్డి లక్ష్మణ్, నల్ల రాజేశ్వర్, ఉయ్యాల లక్ష్మణ్, మకిలి రాకేష్ , అధికారులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular