తాసిల్దార్, ఎంపీడీవో, ఎస్సై కి ఘన సన్మానం
నవగీతం, మల్లాపూర్ :
జరగబోయే పుస్కారాలలో వాల్గొండ గోదావరి కి వచ్చే భక్త జనానికి లోటుపాట్లు లేకుండా కేంద్ర నిధులతో పాటు, రాష్ట్ర బడ్జెట్ లో వాల్గొండ గ్రామ గోదావరి పుష్కరాలకు ఎక్కువ మొత్తంలో నిధులను కేటాయించాలని మండల తాసిల్దార్ శ్రీనివాస్ , ఎంపిడిఓ అలువాల శ్రీకాంత్ ని శ్రీ రామలింగేశ్వర త్రికుటాలయ కమిటీ చైర్మన్ పందిరి నాగరాజు విడిసి, గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో కలిసి వినతి పత్రం అందజేసి పుష్కరాల ఏర్పాట్ల గురించి సంక్షించి అనంతరం శాలువా తో తాసిల్దార్ ఎంపీడీవోని సన్మానించారు.

భక్తుల భద్రత గురించి ఎస్సై అనిల్ కి కలిసి ఆయన సలహాలు తీసుకోని పొలిసు సిబ్బందికి ఆలయ కమిటీ తరుపున వారు ఉండడానికి వసతి, సదుపాయలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం శాలువా తో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి జమాల్, కోశాధికారి బండి రాజు, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బొల్లారపు మురళి, కార్యవర్గ సభ్యులు పనస నాగరాజు, కటికెల గంగాధర్, కార్యదర్శి పడకంటి వెంకటేష్ గ్రామ ప్రజలు శీలం రవి, బొల్లారపు శేఖర్, గుగ్లావత్ సరి రాం మరియు తదితరులు పాల్గొన్నారు


