Monday, March 9, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

📰 Generate e-Paper Clip

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

మెట్ పల్లి డివిజన్ కేంద్రం అయినా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఆదివారం టీఎస్ యూటీఎఫ్ ఉపాధ్యక్షులు అయిటి సుశీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో సముచితంగా రాణిస్తున్న మరింత ముందుకు రావాలని అభిలాషించారు. మెట్ పల్లి మండల విద్యాధికారి కొండా కనకతర మాట్లాడుతూ మహిళలు బహుళ రంగాలలో విశిష్టంగా రాణిస్తున్నప్పటికీ మరింత ఆదర్శవంతమైన పాత్ర సమాజంలో పోషించాలని తెలిపారు. రిటైర్డ్ ఎంపీడీవో కేస్లా బాయి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందరూ ప్రోత్సహించేలా మహిళలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి భూమేశ్వర్, ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ కన్వీనర్ వేముల శ్రీనివాస్, మండల అధ్యక్షులు యాదగిరి, కోరుట్ల మండల ప్రధాన కార్యదర్శి చిరంజీవి, మహిళా ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular