Friday, March 6, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఘనంగా శ్రీపాదరావు జయంతి వేడుకలు

ఘనంగా శ్రీపాదరావు జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

నవగీతం, పెద్దపల్లి

మాజీ సభాపతి స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిని పురస్కరించుకొని సోమవారం జిల్లా కేంద్రంలోని స్ఫూర్తి మానసిక వికలాంగుల పాఠశాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాశిపాక ప్రశాంత్ ముఖ్య అతిథిగా హాజరై, పాఠశాల విద్యార్థుల మధ్య కేక్ కట్ చేశారు.అనంతరం పిల్లలకు స్వీట్లు,పండ్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ శ్రీపాదరావు తన జీవితకాలంలో పేదలు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు.అటువంటి మహనీయుని జయంతి వేడుకలను ఇలా ప్రత్యేక అవసరాలు గల పిల్లల మధ్య జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఈదునూరి విజయ్, దొడ్డుపల్లి రాజేష్, అభినయ్, శివ, సన్నీ,రాబర్ట్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular