Thursday, March 12, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలచదువుతోపాటు సంస్కారం అవసరమే

చదువుతోపాటు సంస్కారం అవసరమే

📰 Generate e-Paper Clip

జిల్లా విద్యాధికారి రాము

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

చదువుతోపాటు సంస్కారం అలవాటు చేసుకోవాలని జగిత్యాల జిల్లా విద్యాధికారి రాము అన్నారు. పిఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ధరూర్ క్యాంపులో గురువారం పదవ తరగతి విద్యార్థుల వీడుకోలు సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా రాము మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా నిర్భయంగా రాయాలని అన్నారు. అదేవిధంగా పరీక్షల తర్వాత మరుసటి రోజు పాఠశాలకు వచ్చి తదుపరి సబ్జెక్టు ప్రిపేర్ కావాలని, సందేహాలున్నచో ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు.

అనంతరం విద్యార్థులకు జిల్లా విద్యాధికారి హాల్ టికెట్స్, పరీక్షా ప్యాడ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాళ్ళ అమర్నాథ్ రెడ్డి, పి ఆర్ టి యు టి ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు బోయిని పెల్లి ఆనందరావు, ఉపాధ్యాయులు బాసిత్, శ్రీదేవి, శ్రీలత, గంగయ్య, షబానా, పవన్, ప్రభాకర్ ,షకీల్, అనుజ, ప్రవీణ్ తదితరులున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular