ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
నవగీతం, కొడిమ్యాల:
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొడిమ్యాల మండల పరిధిలోని తిప్పాయిపల్లి గ్రామంలో మహిళా ఉద్యోగులకు, కార్యకర్తలకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వార్డు సభ్యులు నరెడ్ల గౌతమ్ రెడ్డి, సమాజ సేవలో నిరంతరం శ్రమిస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, రేషన్ డీలర్లు మరియు మహిళా సంఘాల వీఓ లను కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ..కుటుంబ బాధ్యతలతో పాటు సామాజిక బాధ్యతలను భుజాన వేసుకుని పని చేస్తున్న మహిళల సేవలు వెలకట్టలేనివి. ప్రతి రంగంలోనూ మహిళలు రాణిస్తుండటం గర్వకారణం అని కొనియాడారు. అనంతరం ‘ప్రజా పాలన’ స్ఫూర్తితో గ్రామంలోని పలు వార్డుల్లో ఆయన పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ..పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. ప్రతి ఇంట్లో తడి చెత్త. పొడి చెత్తను వేరువేరుగా సేకరించాలని, చెత్తను రోడ్లపై వేయకుండా నిర్దేశించిన వాహనాల్లోనే వేయాలని సూచించారు.గ్రామాన్ని ఆరోగ్యవంతంగా, పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

