పలువురు సర్పంచులు కాంగ్రెస్ పార్టీలో చేరిక
నవగీతం, మల్లాపూర్ :

మల్లాపూర్ మండలం లో వివిధ గ్రామాలల్లో పలు అభివృద్ధి పనులకు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ రావు భూమి పూజ చేసారు. వెంకట్ రావు పేట గ్రామం లో మహిళా సమాఖ్య భవనం, మండల కేంద్రం లో మహిళా సమాఖ్య భవనం నిర్మాణం కొరకు భూమి పూజ చేసారు.మండలం లో బెల్ట్ షాప్ లు, గంజాయి నివారణ కోసం పాటుపడతానని అన్నారు.

వాల్గొండ సర్పంచ్ వసంత,గొర్రెపల్లి సర్పంచ్ వెంకట్ రెడ్డి, వాల్గొండ తండా సర్పంచ్ ధరంసోత్ సురేష్ నాయక్, గొర్రెపల్లి ఉప సర్పంచ్ రాజు, ఎర్ర రమేష్ అడ్వకేట్ పలువురు వార్డు సభ్యులు, సుమారు 800 మంది కార్యకర్తలు నర్సింగ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. పలువురికి సీ.ఎం. ఆర్.ఎఫ్ చెక్కులు,ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసారు.

ఈ కార్యక్రమం లో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు ఎల్లాల జలపతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పూండ్ర శ్రీనివాస్ రెడ్డి,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంతడుపుల పుష్ప లత -నర్సయ్య ,వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఇట్టెడి నారాయణ రెడ్డి,మల్లాపూర్ ఉప సర్పంచ్ గడ్డం సోమరెడ్డి, వెంకట్ రావుపేట సర్పంచ్ వెంకటేష్, మొగిలపేట సర్పంచ్ గోల్కొండ కళ -రమేష్, వాల్గొండ సర్పంచ్ తోపారపు వసంత, శాఖపురపు కిరణ్, మరిపెల్లి మల్లయ్య ,ఏనుగు వెంకట్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


