నవగీతం, మెట్ పల్లి :
మెట్ పల్లి లో పదవ తరగతి (1992-93) బ్యాచ్ పూర్వ విద్యార్థులు మంగళవారం హోలీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ హొలీ పండగను పురస్కరించుకొని పదవ తరగతి (1992-93) బ్యాచ్ వారు తమ సన్నిహితులకు ఒకరినొకరు రంగులను చల్లుకుని ఆనందంలో మునిగితేలారు. ఆత్మీయ మిత్రులతో హోలీ పండుగ సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలలో ఒకరినొకరు రంగులు చల్లుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అత్మీయ మిత్రులు పూర్వ విద్యార్థులు మహమ్మద్ ఆజీమ్ సుధాకర్ సంతోష్ వెంకటేష్ బద్రి వేణు భుమేశ్వర్ సత్యనారాయణ మహేష్ వేణుగోపాల్ అన్నం నాగరాజ్ ప్రవీణ్ ప్రసాద్ అలీ తదితరులు పాల్గొన్నారు.


