Monday, March 9, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలపెద్దాపూర్ మల్లన్న జాతరలో పాల్గొన్న డాక్టర్ రఘు

పెద్దాపూర్ మల్లన్న జాతరలో పాల్గొన్న డాక్టర్ రఘు

📰 Generate e-Paper Clip

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో ఆదివారం జరిగిన మల్లన్న జాతరలో నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘు పాల్గొన్నారు. గ్రామానికి వచ్చిన సందర్భంగా ఆలయ కమిటీ నాయకులు, వీడీసీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. గ్రామానికి వచ్చిన సందర్భంగా డాక్టర్ రఘును కమిటీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుమలత – జీవన్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ తేలుకంటి గంగాధర్, నాయకులు దండుగుల శ్రీనివాస్, రేండ్ల రాజన్న, చెట్లపల్లి దేవేందర్ గౌడ్, నల్ల వెంకటేష్, కొత్తూరి గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular